వరద

Sathyam Sankaramanchi.jpg

వరద

సత్యం శంకరమంచి

Satyam Sankaramanchi (1937-1987)

Sathyam Sankaramanchi.jpg
Susmita.jpeg

Die Überschwemmung

Übersetzt von : Susmitha Nalamasa)

Translated by : Susmitha Nalamasa unterstützt von J.V.D. Moorty

Susmita.jpeg

About the work: First published as a series in Andhra Jyoti between 1975-1977. As Book published by Kavitha Publications, Vijayawada. Copyright with Sankaramanchi Ravi Shankar, Mail: shankara_5@yahoo.co.in

(Die erste der Geschichten in der Serie : Amravati Geschichten (erst veröffentlicht in der Zeitung Andhra Jyoti zw. 1975-1977); Autor: Satyam Sankaramanchi, Andhra Pradesh, Indien. Sprache: Telugu) übersetzt von Nalamasa Susmitha, unterstützt von J.V.D. Moorty. Muttersprachliche Verfeinerung: Dagmar Brech.

అల్లంత దూరాన మబ్బుల్ని తాకుతున్న గాలిగోపురం. ఆ వెనక సూర్యకిరణాల పలకరింపుకు మెరుస్తున్న బంగారుపూత అమరేశ్వరాలయ శిఖరం. ఎత్తయిన ఆ శిఖరానికి చుట్టూతా ఎన్నో ఆలయాలు. ఎన్నెన్నో శిఖరాలు.

Weit entfernt, die Wolken berührend, steht ein Tempelturm. Dahinter glänzt, von Sonnenstrahlen erhellt, die goldbeschichtete Turmspitze des Amareshwara-Tempels. Mehrere Tempel und zahlreiche Turmspitzen umgeben diese hohe Turmspitze.

తూర్పున వైకుంఠపురం కొండ, దక్షినాన పాడుపడ్డ బౌద్ధ స్తూపాలు, పడమట ఈనాడు దిబ్బగా మారిన అల్లప్పటి శాతవాహనుల ధాన్యకటకం, ఉత్తరాన ఆ స్తూపాల్ని, ఆ దిబ్బల్ని వాటిమద్య ఉండే ప్రజల్ని, ఆ ఊర్ని వడ్డాణంలా చుట్టి గలగల పారుతున్న కృష్ణానది, అద్గదీ అమరావతి!

Im Osten liegt der Berg Vaikunta-Puram, im Süden sind zerstörte buddhistische Stupas, im Westen befindet sich der zertrümmerte Erdhügel namens Dhanyakatakam - die Hauptstadt der damaligen Dynastie-Satavahana. Im Norden die Stupas, die Erdhügel, das darunter wohnende Volk, der Fluss Krishna, der die Stadt wie ein Gürtel umschließt und gurgelnd fließt. Das ist der Ort Amaravathi.

ఒకనాడు గుర్రాలూ, రధాలూ తిరుగుతూండగా సైనిక విన్యాసాలు జరిగిన ఆ రాజవీధిలో ఇవ్వాళ కుక్కలూ, గాడిదలూ, మేత దండగని ఊరుమీద తోలేసిన సాంబయ్యగారి ముసలి ఎద్దూ నీరసంగా తిరుగుతున్నాయి. రత్నాల రాసులూ, ముత్యాల మూటలూ బళ్ళకెత్తుకు నడిపించిన ఆ వీధిలో ఇవ్వాళ పొట్టుబస్తాలు లాగుడు బండి మీద తోయ్యలేక తోయ్యలేక తోస్తున్నారు.

Auf der Straße dieser Hauptstadt, auf der damals Pferde liefen, Kampfwagen fuhren, Soldaten paradierten, bewegen sich heute Hunde, Esel und Sambayyas alter müder Ochse. Die Straße, auf der damals Edelsteine und Perlen haufenweise transportiert wurden, auf der werden heute Säcke mit Getreidespelzen in Karren mühsam geschoben.

అంత పెద్దవీధి ఎవరు వూడ్చి శుభ్రం చేస్తారు? ఎవరిళ్ళ ముందు వాళ్ళు వూడ్చుకుని కళ్ళాపు జల్లుకొని కసువంతా నడిబజార్లో పోస్తారు. ఆ కసువు కుప్పల మీద కుక్కలు ముడుచుకు పడుకుంటే, ఇంకో పక్క కోళ్ళు కోడిపిల్లలు ముక్కుల్తో కెలుకుతుంటాయి. ఒకనాడు భేరీలు మోగించే ఉత్తర గాలిగోపురంలో పిచ్చి సూరిగాడు పీలికలు కాళ్ళనిండా చుట్టుకొని గంజాయి దమ్ము లాగుతున్నాడు. ఆ విశాల వటవృక్షాల కింద, ఒకనాడు శ్రవణపర్వంగా వేదగానం విన్పిస్తే, ఇవ్వాళ “నా కొడకా! నా ముక్కకి అడ్డొచ్చావు గదరా!” అంటూ పేకాట జోరుగా సాగుతోంది..

Wer fegt und räumt diese große Straße auf? Alle räumen nur den Teil vor dem eigenen Haus auf und werfen den Restmüll in die Straßenmitte. Auf diesem Müll schlafen einerseits die Hunde, andererseits findet man dort auch Hühner und ihre Küken. Eines Tages rauchte der geisteskranke Suri Cannabis im nördlichen Tempelturm. Unter diesen großen Bäumen hörte man einst vedische Lieder, aber heute hört man Schimpfwörter wie „Du Sohn von ...... " Du hast meine Chance verdorben!“, während das Kartenspiel munter weitergeht.

భౌద్ధ విశ్వవిద్యాలయంలో కొన్నివేల మంది దేశ విదేశీ విద్యార్ధులకు జ్ఞానోపదేశం చేసినచోట – దిబ్బలు, వట్టి దిబ్బలు కన్పిస్తున్నాయి. దిగులుగా ఉన్న ఆ దిబ్బల మీద పందులు తిరుగుతున్నాయి. వాటిని అదిలిస్తున్న వడ్డెరోళ్ళ పోరగాళ్ళు కన్పిస్తున్నారు.

An der buddhistischen Universität hier, in der mehr als Tausenden in- und ausländischen Studierenden das Wissen beigebracht wurde, sind heute nur Sandhügel zu sehen. Darauf laufen die Schweine. Man sieht hier die frechen Jungen, die versuchen, diese Schweine wegzujagen.

కృష్ణకి నీళ్ళకెళ్తున్న ఓ పడుచు పిల్ల ముత్యాల కాలిపట్టీ జారీపోతే “కంగారెందుకులే” అనుకుని ఆ పిల్ల కృష్ణలో నీళ్ళు ముంచుకుని ఆ బిందె ఇంట్లో పెట్టి తిరిగివస్తే ఆ ముత్యాలపట్టీ అక్కడే భద్రంగా ఉండగా కాలికి తగిలించుకొని గునగున వెళ్ళిపోయిందంట. ఇవ్వాళ కృష్ణకి నీళ్ళకెళ్తున్న చాలామంది ఆడపిల్లలకి కాళ్ళ పట్టీలు లేవు. అయిన గునగున నడిచి పోతునే ఉన్నారు. ముఖాలు నవ్వుతునే ఉన్నాయి గుండెల్లో ఎంత దిగులున్నా.

Eines Tages ging ein Mädchen zum Krishna-Fluss Wasser holen, währenddessen ihr Fußkettchen aus Perlen heruntergefallen war. Mit dem Gedanken, es habe keine Eile ging sie zuerst Wasser holen, stellte die Kanne ins Haus, und dann kehrte sie zurück und fand ihr Fußkettchen unversehrt am gleichen Ort. Sie nahm es, band es wieder fest und sei fröhlich davongelaufen. Heute haben viele Mädchen, die zum Krishna-Fluss gehen, keine Fußkettchen. Trotzdem laufen sie fröhlich. Die Gesichter lachen, obwohl das Herz leidet.

అప్ఫటికీ ఇప్పటికీ సాక్షి ఆ కృష్ణవేణి. గతాన్ని కడుపులో దాచుకుని ఏమీ తెలియనట్టు నిండుగా ప్రవహిస్తోంది. కృష్ణమ్మ అమరేశ్వరుడి గుడి గోడలో రసి పారుతోంది. పరమేశ్వరుడికి పాదాభిషేకం చేస్తూ ముందుకెళ్తోంది. అల్లంత దూరాన, సూరీడు రాతిరేళ పడుకునే చోటు నుంచి బయలుదేరి పరుగు పరుగున అమరావతి వైపుకొస్తున్నాడు. కన్ను సారించి చూస్తే రెండు కొండకొమ్ముల మధ్యనుంచి వచ్చే కృష్ణమ్మ కావలసిన చుట్టం ఊరునుంచి వస్తున్నట్టుంటుంది. తుళ్ళితుళ్ళి పారుతోంది. మళ్ళీ మళ్ళీ పారుతోంది. తలంటు పోసుకొని విప్పుకున్న జుట్టులా పాయలు పాయలుగా పారుతోంది. ఆ జుట్టుని బంధించి జడగా అల్లినట్లు ఏకపాయగా పారుతోంది.

Der Fluss Krishna ist der Zeuge von gestern und heute. Mit der Vergangenheit im Inneren verborgen, fließt der Fluss, ohne sich dessen bewusst zu sein. Der Fluss Krischna, auch der Herrgott für die Menschen dort, fließt durch Amareshwaras Tempel und es sieht so aus, als würde der Gott Krischna die Füße des Gottes Amareshwaras berührend weiterfließen. Von einem weit entfernten Ort scheint die Sonne in Richtung Amaravati. Der Fluss Krischna zwischen zwei Bergen sieht aus wie ein aus einem anderen Dorf kommender Verwandter. Er fließt schnell und beständig.

ఇంకా తెల్లారలేదు. దొడ్లల్లో హోరు, ఊళ్ళో హోరు. ఉన్నట్టుండి కృష్ణ పొంగింది. రాత్రికి రాత్రి వరదొచ్చింది. ప్రళయంగా పొంగింది. ఆ మసక వెల్తుర్లో కృష్ణ గర్జిస్తూ ఇంకా పొంగుతుంది. దొడ్లల్లో నడుమెత్తు నీళ్ళు వచ్చేశాయి. జనం గోల, హడావుడి, తోసుకోటాలు, మట్టిగోడలు విరిగిపడిపోతున్నాయి. గుడిపక్క వీధిలో ఉన్న ఇళ్ళు ఎత్తు మీద ఉన్నా దొడ్లో సామానంతా రాత్రికి రాత్రే కృష్ణలో కలిసిపోయింది.

Die Sonne ist noch nicht aufgegangen. Auf den Höfen und in den Dörfern hört man Schreie. Plötzlich ist der Fluß Krischna angeschwollen; über Nacht gab es Hochwasser, wie eine Sintflut. In der verschwommenen Licht wurde das Tosen des Krischna-Flusses noch lauter. In den Höfen gab es schon hufthöhes Wasser. Unter Menschen gab es Unruhe, Eile, Gedränge; Leimwände brachen zusammen. Obwohl die Häuser neben der Tempelstraße auf einer Anhöhe lagen, sind die Höfen darin über Nacht im Fluss versunken.

పల్లపు వీధి మూడొంతులు మునిగిపోయింది!

Palle-Straße ist drei Viertel gesunken!

మిట్ట మీదికి నీళ్ళెక్కుతున్నాయి!

Das Wasser steigt auf die Anhöhe.

యానాదుల గుడిసెలు ఎగిరిపోయాయి!

Die Hütten von Yanadis waren weggeblasen !

తెలతెలవారుతుంటే కృష్ణమ్మ ప్రళయరూపం కన్పించింది. ఈ భూమిని మింగేద్దామన్నంత కోపంతో పొంగుతోంది. అవతలొడ్డు కానటంలేదు. ఎదురుగా జలసముద్రం, ఎగిరెగిరి పడ్తున్న అలలు. ఆ మహాప్రవహం మధ్యలో కొట్టుకు పోతున్నఇళ్ళ కప్పులు, క్షణంలో ఓ కప్పు నీళ్ళలో కలిసిపోయింది. మోరలెత్తి అంబా అని అరుస్తున్న పశువులు కొట్టుకుపోతున్నాయి. మోరలు మునిగిపోతున్నాయి. ఆ వడిలో కొమ్ములు మునిగిపోతున్నాయి. కొట్టుకొస్తున్న దుంగలు, కలప, ఓ దుంగ మీద వూర కుక్కొకటి దీనంగా మొరగుతోంది. రక్షించమని. ఆ వేగానికి దుంగ మెలికలు తిరగుతుంటే తనూ గిర గిర తిరుగుతూ కాళ్ళు నిలదొక్కుకుంటోంది ప్రాణభయంతో ఉన్న కుక్క.

Als es Morgen wurde, konnte man sehen, wie wütend der Gott Krischnamma ist. Er fließt, als würde er aus Angst die Erde verschlingen wollen.. Die andere Seite des Ufers ist nicht zu sehen. Ein Meer, hohe Wellen, weggefegte Häuser, schreiende Vögel in dieser großen Überschwemmung! Baumstämme und Holzbretter schwimmen im Wasser. Auf einem Baumstamm sitzend heult und bettelt ein Straßenhund, damit man ihn rettet. Als der Baumstamm wegen der Geschwindigkeit des Wassers wackelte, versuchte der erschrockene Hund mit seinen Füßen Balance zu halten.

అంతలో ప్రవాహం మధ్య నుంచి ఓ మనిషి కేక “దేవుడోయ్! రచ్చించండో” అని గుండెలు చీల్చుకుపోయే కేక. క్షణంలో ఆ కేక దూరమైంది. మనిషి కన్పించ లేదు. ఎవరూ ఏం చేయ్యలేరు. సాయానికి ఎవరైనా వెళ్తే ఆ వడికి తిరిగి రాలేరు. నిస్సహాయంగా ఆ బీభత్స భయానక దృశ్యాల్ని చూస్తున్నారు వొడ్డున నుంచున్న జనమంతా. అందరి గుండెల్లో భయం..

Inzwischen hörte man einen menschlichen Schrei – „ Gott! Rette mich“ – ein herzzerreißender Schrei. In der nächsten Sekunde entfernte sich dieser Schrei, diese Person war nicht mehr zu sehen. Niemand konnte was tun. Auch wenn jemand Hilfe leisten möchte, könnte er sicherlich nicht lebend zurückkommen. Alle sehen vom Ufer aus diese schrecklichen Ereignisse hilflos an. Jedes Herz ist voller Angst.

ఇళ్ళ ముందుకు నీళ్ళు రావడంతో పిల్లలంతా కాగితం పడవలాటలాడుకుంటున్నారు. పడవలు చేసి పెట్టమని పెద్దల్ని వేదిస్తున్నారు. స్కూలు పిల్లలు గోడమీద బొగ్గుగీతలు గీసి క్షణ క్షణం పెరుగుతున్న నీటి మట్టాన్ని కొలుస్తున్నారు.

Da es überall um das Haus Wasser gibt, spielen kleine Kinder mit Papierbooten. Sie drängen ihre Älteren, für sie Boote zu basteln. Die schulpflichtigen Kinder messen jede Sekunde den steigenden Hochwasserspiegel an der Wand.

“ పల్లపీదిలో అర్ధరాత్రేళ సంగయ్యింట్లో పసిపిల్లకి తడితగిలి అదేడిస్తే లేచాడంటయ్యా! అప్పటికి గోడలిరిగె. నీళ్ళు తోసుకొచ్చె! పెళ్ళాం పిల్లలూ పానాల్తో బయట కొచ్చారంట!”

Um Mitternacht ist Sangayya aufgestanden wegen des Weinens des kleinen Mädchens, als sie nass wurde. Da waren die Wände schon zerbrochen. Überall Wasser. Seine Frau und Kinder konnten ihr Leben retten.

“మిట్టమీది ఎంకటసామి మేకల మందంతా కొట్టుకపోతుంటే ఏం చెయ్యలేక సూస్తా నుంచున్నాట్టయ్య!”

Alle sahen hilflos zu, als Venkatswamis Ziegenherde auf der Anhöhe weggeschwemmt wurde, weil niemand was tun konnte, um sie zu retten.

“సాలెపేటలో వరదలో కొట్టుకొచ్చిన పాము ఇంట్లోదూరి సుబ్బయ్యని కరిచిందట!”

Die Schlange, die wegen der Flut ins Haus eingedrungen war, hat Subbayya gebissen.

“లంకల్లో మేతకెళ్ళిన గొడ్లు, పాలేళ్ళు ఏవయనారో!”

Was wäre mit dem weidenden Rind und dem Weideland passiert!

ఇల భయంకరమైన కధలు చెప్పుకొంటున్నారు. కొందరు ఇల్లాళ్ళు కృష్ణమ్మని శాంతించమని పసుసు, కుంకుమ అర్పించి కొబ్బరికాయలు కొడ్తున్నారు. పిల్లలు కొబ్బరి ముక్కల కోసం ఎగబడ్తున్నారు. ఊరు సగం మునిగిపోయింది. దొరికిన సామాన్లతో జనమంతా ఊరి మధ్యనున్న మాలక్షమ్మ వారి చెట్టు దగ్గర చేరారు. చంటి పిల్లలకి చెట్లకే ఉయ్యాలలు వేశారు. పది గంటల వేళ వరద తగ్గుముఖం పట్టింది. వూళ్ళో పెద్దలు వెంకటస్వామి, వీరాస్వామి, అవధాన్లు అంతా మాలక్షమ్మ వారి చెట్టుదగ్గర కొచ్చారు.

Alle reden über diese erschreckende Ereignisse. Einige Frauen beten den Gott Krischna an, sich zu beruhigen und bieten ihm Kurkuma, Zinnoberrot und Kokosnüsse von zuhause an. Die Kinder sammeln eifrig diese Stücke ein. Das Dorf ist halb versunken. Die Leute holten Dinge, die sie fanden und haben sich unter dem Baum von der Göttin Mahalakshmi in der Stadtmitte versammelt. Sie hängten Schaukeln an die Bäume für kleine Kinder. Um 10 Uhr hat die Flut abgebremst. Die Älteren im Dorf, Venkaswami und Veeraswami und alle Gelehrten kamen zum Baum.

“ఇప్పుడేం చేద్దాం? ఏం చేద్దాం?” అని తలపట్లు పట్టుకున్నారు.

Jeder fragte – „Was machen wir jetzt? Was nun?“

“చేసేదేముందయ్యా? ముందీ జనానికి తిండీ తిప్పలు చూడండి” అన్నారెవరో. అంతే! పది మంది కుర్రాళ్ళు గడ్డపారలు తీసుకుని గాడిపొయ్యి తవ్వేశారు. ఇంకో పదిమంది గోతాలు తీసుకుని ఇంటింటికీ వెళ్ళి బియ్యం వసూలు చేశారు. కోటలో వంట సామాగ్రి తెచ్చారు. పప్పూ, ఉప్పూ, నెయ్యి, నూనె వాటంతట అవే వచ్చాయి. ఎసట్లో బియ్యం పోశారు. వంట నిర్వహిస్తున్న వేంకటేశ్వర్లు, శోభనాద్రి “ఇహ కూరలే ఆలస్యం” అన్నారు. అవధాన్లగారి భార్య, కోమటి సూరమ్మ, తెలగ వెంకమ్మ, గొల్ల సుబ్బమ్మ కత్తి పీటలు ముందేసుకుని చక చక కూరలు తరిగేశారు. పన్నెండు గంటలకల్లా దోసకాయ పప్పు, పులుసు అన్నం తయారయిపోయాయి.

Was wir tun sollten? Wir sorgen erst dafür, den Hunger dieser Menschen zu stillen, sagte jemand.“ Zehn Jugendliche gruben eine Kochgrube zum Kochen aus. Eine weitere zehn gingen zu jedem Haus mit Säcken und sammelten Reis. Zutaten zum Kochen wurden auch gebracht. Linsen, Salz, Ghee, Öl gab es auch. Der Reis wurde gekocht. Die Köche Venkateswarlu und Shobhanadri sagten: „Nun dauert es ein bisschen bei der Gemüsezubereitung.“

„Avadhanulus Frau, Sooramma der Kasten Komati angehörend, Venkamma, Angehöriger der Telaga-Kaste , Subbamma von der Golla-Kaste und alle Unberührbaren schnitten schnell Gemüse. Bis 12 Uhr waren schon Gurken-Linsen-Gemisch, Suppe und Reis zubereitet.

సెట్టిగారు విస్తళ్ళ కట్టలిస్తే నడిబజారులో బారులుగా విస్తళ్ళు వేశారు. శాస్త్రిగారు సంధ్యావందనం ముగించుకుని తనూ ఓ విస్తట్లో కూర్చున్నాడు. ఇటు ప్రక్క చూస్తే తెలగ సుబ్బరాయుడున్నాడు. ఇంకో పక్క గొల్ల రాములున్నాడు. ఎవరి పక్క ఎవరున్నారో ఎవరికీ పట్టలేదు. భగవన్నామస్మరణలు సాగుతున్నాయి. వడ్డనలయిపోయాయి. శాస్త్రిగారు అవుపోసనపట్టి, నెయ్యికోసం చెయ్యిజాస్తే వడ్డించటానికి వచ్చిన నేతి జాడీ చెంగున వెనక్కు వెళ్ళింది. వడ్డిస్తున్న మాలసంగడు శాస్త్రిగారికి వడ్డించడం ఇష్టంలేక పారిపోతున్నాడు. శాస్త్రిగారు “ఒరే సంగా!” అని పెద్దగా కేకపెట్తే, భయం భయంగా వొచ్చిన సంగణ్ణి చూసి “ఒరే సంగా!” నాకూ ఆకలేస్తుంది. ఇంకొకళ్ళు వేస్తే నెయ్యి, నువ్వువేస్తే నెయ్యి కాకపోదురా......... వెయ్యరా” అన్నాడు చేయ్యి ముందుకు చాపి. సంగడు ఆనందంగా వడ్డించాడు. “నమః పార్వతీపతయే” అన్నకేకలు దేవాలయ శిఖరాల్నంటాయి.

Die von Setty bereitgestellten Blattteller wurden in die Straßenmitte in eine Reihe gelegt. Shastri, der brahmanische Tempelpriester grüßte die Sonne und saß vor einem Teller. An einer Seite saß Telaga Subbarayudu, auf der anderen Seite saß Golla Ramulu. Es war allen egal, wer neben wem saß. Alle beteten Gott an. Das Essen wurde serviert. Shastri, der Tempelpriester wollte Ghee. Der, der unberührbaren Kaste angehörige Sanga, der Ghee servierte, entfloh, sich weigernd, dem Brahmanen Shastri zu servieren. Shastri rief laut: „ Sanga!“ Er sagte zu dem verängstigten Sanga: "Ich habe Hunger! Du hast Hunger! Man nennt es Ghee, wenn es andere servieren und kein Ghee, wenn du es servierst? Serviere mir Ghee!“ Und er streckte seine Hand nach vorne aus. Sanga servierte nun fröhlich. „ Nahma Parvathipataye! Sei gegrüßt Schiwa, der Ehegatte Parwati !“, diese feierlichen Gesänge aus den Mündern erreichten die Spitze des Tempels.

వరదొచ్చి మనుషుల మనసులు కడిగేసిందనుకుందామా? అబ్బే! నాకు నమ్మకం లేదు. స్నానం చేసిన వొంటికి తెల్లారేప్పటికి మళ్ళీ మట్టి పట్టినట్టు మనసుల్లో మళ్ళీ మలినం పేరుకుంటోంది. ఎన్ని వరదలొచ్చినా మనిషి మనుసు కడగలేక పోతోంది.

Denkt ihr, dass die Flut die Seele der Menschen gereingt hat? Ich glaube nicht. Wie unser Körper trotz des täglichen Duschens am nächsten Tag wieder schmutzig wird – wird die Seele auch unrein. Egal wie viele Überschwemmungen es geben würde - kann die Seele des Menschen nicht gereinigt werden.

Thanks to 1) Mr. Ravishankar Sankaramanchi, son of Shri Sathyam Sankaramanchi for permitting to publish the original, 2) the Germanist J.V.D. Moorty for supporting the translation work and 3) Mrs. Dagmar Brech for fine-tuning the language for the target language reader. Thanks also to Mr. Darla, for proof-reading the Telugu text.

Unser Dank gilt 1) Herrn Ravishankar Sankaramanchi, Sohn des Autors, 2) Herrn J.V.D Moorty, dem Telugu-Hindi sprechenden Germanisten für die Korrekturarbeit und 3) Frau Dagmar Brech für die sprachliche Verfeinerung.